CM Jagan – MP Subramanya Swamy: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కీలక భేటీ.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు.

CM Jagan - MP Subramanya Swamy: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కీలక భేటీ.!
Jagan Swami

AP CM Jagan – MP Subramanya Swamy: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జ‌రిగిన ఈ భేటీలో టీటీడీ చైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీతోపాటు, దేశంలోని పలు అంశాల మీద చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అటు, ఏపీ రాజకీయాల మీద కూడా స్వామి ఆరా తీసినట్టు సమాచారం.

మరోవైపు, దేశంలో మైనారిటీలు గుండెమీద చేయివేసుకుని పూర్తి భరోసాగా, భధ్రంగా ఉండగలిగే రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలో షేక్ కులస్ధుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మైనారిటీలు విద్య, ఉద్యోగావకాశాలలో వెనకబడి ఉండటాన్ని గమనించి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారన్నారు.

వైయస్ జగన్ మొదటినుంచి మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలియచేశారు. ముఖ్యంగా మైనారిటీలు అత్యధికంగా పేదవర్గాలుగా ఉండటం గమనించి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వారి సంక్షేమానికి అనేక పథ‌కాలను శ్రీ వైయస్ జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ పథ‌కాలను ఆయా కుటుంబాలదరికి చేర్చాల్సిన బాధ్యత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని మైనారిటీ నేతలు, షేక్ కార్పోరేషన్ ఛైర్మన్, డైరక్టర్లపై ఉందన్నారు.

Read also: Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు?

:

Click on your DTH Provider to Add TV9 Telugu