Breaking: ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కంపెనీ సీఈవో సున్‌కే జియాంగ్‌, డైరెక్టర్ డీఎస్ కిమ్‌, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్‌రావు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 9:40 pm, Tue, 7 July 20
Breaking: ఎల్జీ పాలిమర్స్‌ కేసులో 12 మంది అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కంపెనీ సీఈవో సున్‌కే జియాంగ్‌, డైరెక్టర్ డీఎస్ కిమ్‌, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్‌రావు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాస్ లీక్ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ హైపవర్‌ కమిటీ సోమవారం సీఎం జగన్‌కు నివేదిక సమర్పించింది. మొత్తం 350 పేజీల నివేదికను నీరబ్‌ కుమార్ నేతృత్వంలోని కమిటీ సీఎంకు సమర్పించారు. ఈ క్రమంలోనే తాజాగా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం గమనర్హం.

కాగా లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా విశాఖ జిల్లా ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను మే నెల ప్రారంభంలో ప్రారంభించారు. ఆ క్రమంలో మే 7న గ్యాస్ లీక్ కాగా.. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 585 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రోజే గోపాల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎల్జీ పాలిమర్స్‌పై 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.