ఇది “కనికట్టు” బడ్జెట్-పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెటంతా కనికట్టులా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బడ్జెట్ ప్రజలను మరోసారి ఆకర్షించడానికి రూపొందించారు తప్ప.. ప్రజల అభివృద్ధిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చిన్న ప్రయత్నం కూడా జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఆర్ధిక వాస్తవికత, స్పష్టత లోపించిందని అన్నారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిదని ఎద్దేవ చేశారు. అవి ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే […]

ఇది కనికట్టు బడ్జెట్-పవన్ కళ్యాణ్
Sanjay Kasula

|

Jun 16, 2020 | 8:36 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెటంతా కనికట్టులా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బడ్జెట్ ప్రజలను మరోసారి ఆకర్షించడానికి రూపొందించారు తప్ప.. ప్రజల అభివృద్ధిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోలేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆదాయాన్ని పెంచడానికి చిన్న ప్రయత్నం కూడా జరగలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో ఆర్ధిక వాస్తవికత, స్పష్టత లోపించిందని అన్నారు. అభివృద్ధి లేని సంక్షేమం నీటి బుడగలాంటిదని ఎద్దేవ చేశారు. అవి ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని హితవు పలికారు.  కీలకమైన వ్యవసాయం, ఇరిగేషన్, గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యం వంటి శాఖల బడ్జెట్ కు కోతలు విధించారని మండిపడ్డారు.  ఈ బడ్జెట్‌పై  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలోను అంచనాలు భారీగా చూపారు తప్ప ఆచరణ ప్రణాళికలు కనిపించలేదని జనసేనాని మండిపడ్డారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu