ఏపీ-తమిళనాడు సరిహద్దులో తనిఖీలు..రూ.కోటి 80వేలు పట్టివేత

గత కొన్ని రోజులుగా ఏపీ-తమిళనాడు రాష్ట్రాల మధ్య నగదు రవాణా సాగిస్తూ పట్టుబడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి..

ఏపీ-తమిళనాడు సరిహద్దులో తనిఖీలు..రూ.కోటి 80వేలు పట్టివేత
Follow us

|

Updated on: Jul 17, 2020 | 6:29 PM

గత కొన్ని రోజులుగా ఏపీ-తమిళనాడు రాష్ట్రాల మధ్య నగదు రవాణా సాగిస్తూ పట్టుబడిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. గురువారం రోజున ఒంగోలుకు చెందిన ఓ కారును పోలీసులు ఏపీ-తమిళనాడు సరిహద్దులో పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.5.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ కారుపై ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం వివాదాస్పదం అయింది. అలాగే ఆ కారును ఓ మంత్రి డ్రైవర్ నడుపుతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆ డబ్బు తనదేనంటూ ఒంగోలుకు చెందిన ఓ నగల వ్యాపారి వెల్లడించడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదిలా ఉంటే, తాజాగా, కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో వాహనాల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరు వెళుతున్న కారును చాపిరేవుల గ్రామంలో పోలీసులు సోదా చేయగా రూ. కోటి 80 వేల నగదును గుర్తించారు. ఈ నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసి కేసు నమోదు చేశారు.