బాబు.. ఆ పదాలకు అర్థం తెలియని వ్యక్తివి నువ్వొక్కడివే: మోహన్ బాబు ఫైర్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు మోహన్ బాబు విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. మోహన్ బాబు గురించి ప్రస్తావించారు. మోహన్ బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ కామెంట్లు చేశారు. వాటికి తాజాగా కలెక్షన్ కింగ్ స్పందించారు. ‘‘చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:23 pm, Mon, 4 November 19
బాబు.. ఆ పదాలకు అర్థం తెలియని వ్యక్తివి నువ్వొక్కడివే: మోహన్ బాబు ఫైర్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు మోహన్ బాబు విరుచుకుపడ్డారు. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. మోహన్ బాబు గురించి ప్రస్తావించారు. మోహన్ బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ కామెంట్లు చేశారు. వాటికి తాజాగా కలెక్షన్ కింగ్ స్పందించారు.

‘‘చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!’’ అని సోషల్ మీడియాలో మోహన్ బాబు కామెంట్లు చేశారు. కాగా ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.