“వేదాద్రి” మృతుల‌కు ఇరువురు సీఎంల ఎక్స్‌గ్రేషియా

బుధవారం వేదాద్రి వద్ద జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన 12 మంది మృతిచెందారు. మృతుల కుటుంబాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌, అటు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు ...

వేదాద్రి మృతుల‌కు ఇరువురు సీఎంల ఎక్స్‌గ్రేషియా
Jyothi Gadda

| Edited By: Pardhasaradhi Peri

Jun 18, 2020 | 1:15 PM

కృష్ణా జిల్లా వేదాద్రి ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రటించింది. ఈ పరిహారం ఆంధ్రా ప్రాంత మృతులకు కూడా వర్తిస్తుందని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. వేదాద్రి రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడను సీఎం ఆదేశించారు.
వేదాద్రి ఘ‌ట‌న‌పై అటు, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ప‌రిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనిని తెలంగాణ వారికీ వర్తింపు చేయాలని జగన్ పేర్కొన్నారు. ఏపీ భూభాగంలోనే ప్రమాదం జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
బుధవారం వేదాద్రి వద్ద జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదంలో ఖమ్మం, కృష్ణా జిల్లాలకు చెందిన 12 మంది మృతిచెందారు. వారిలో తొమ్మిది మంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, జమలాపురం గ్రామాలకు చెందినవారు కాగా, మరో ముగ్గురు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందినవారు ఉన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu