మరో వివాదంలో జేసీ.. బయటపడ్డ ఫోర్జరీ డాక్యుమెంట్లు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. జేసీ ట్రావెల్స్‌లో ఫోర్జరీ డాక్యుమెంట్లు బయటపడ్డాయి. తాడిపత్రి ఎస్సై సంతకాలు ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారు. నకిలీ పత్రాలతో జేసీ ట్రావెల్స్ ఆరు లారీలను బెంగళూరులో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు నాగేంద్ర, రఘులను అరెస్ట్ చేసి.. ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మెషిన్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో […]

మరో వివాదంలో జేసీ.. బయటపడ్డ ఫోర్జరీ డాక్యుమెంట్లు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. జేసీ ట్రావెల్స్‌లో ఫోర్జరీ డాక్యుమెంట్లు బయటపడ్డాయి. తాడిపత్రి ఎస్సై సంతకాలు ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారు. నకిలీ పత్రాలతో జేసీ ట్రావెల్స్ ఆరు లారీలను బెంగళూరులో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఇప్పటికే జేసీ ట్రావెల్స్ ఉద్యోగులు నాగేంద్ర, రఘులను అరెస్ట్ చేసి.. ల్యాప్‌టాప్, బయోమెట్రిక్ మెషిన్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రామ్మూర్తి, ఇమామ్‌లు పరారీలో ఉన్నారు. ఈ కేసులో జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాత్రలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Published On - 3:33 pm, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu