స్కుళ్లు ఓపెన్ చేసిన తొలిరోజే.. జగనన్న విద్యా కానుక

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే 'జగనన్న విద్యా కానుక'ను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో...

స్కుళ్లు ఓపెన్ చేసిన తొలిరోజే.. జగనన్న విద్యా కానుక
Follow us

| Edited By:

Updated on: May 25, 2020 | 3:08 PM

ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. స్కూళ్లు తెరిచిన మొదటి రోజే ‘జగనన్న విద్యా కానుక’ను ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 7 రకాల వస్తువులను కానుకగా ఇవ్వనుంది. ‘జగనన్న విద్యా కానుక పేరిట కిట్‌’ను ప్రతీ విద్యార్థికి పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం.

ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చూకూరనుంది. ప్రభుత్వ స్కూళ్లు తెరిచిన మొదటి రోజునే 7 రకాల వస్తువులను విద్యార్థులకు అందించేందుకు ‘సమగ్ర శిక్ష అభియాన్’ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అలాగే వీటితో పాటు విద్యార్థులకు బస్సు ప్రయాణాన్ని కూడా ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. వేరే వాహనాల్లో వచ్చే వారికి అయ్యే ఛార్జీని కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. అలాగే విద్యార్థి, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీషు మీడియంలో చేరవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో భోధన ఉన్న ప్రతీ తరగతిలో తెలుగును తప్పనిసరి చేసింది జగన్ సర్కార్. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా రెండు రకాల భాషల్లోనూ భోధన ఉండాలని పేర్కొంది.

– జగనన్న విద్యా కానుక కింద మూడు జతల దుస్తులు (స్కూల్ యూనిఫామ్), బెల్టు, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్ అందిస్తారు.

– వీటిని పాఠశాల పేరెంట్స్ కమిటీల ద్వారా విద్యార్థుల తల్లులకు పంపిణీ చేయిస్తారు. కాగా యూనిఫామ్ కుట్టుకూలికి అయ్యే ఖర్చు రూ. 40 చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనుంది ప్రభుత్వం.

– ‘జగనన్న విద్యా కానుక’కు ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరానికి గానూ రూ.650.60 కోట్లను ఖర్చు చేస్తోంది.

– సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకే నిధుల లభ్యత ఉంటుంది.

– 9, 10 తరగతులకు ఎస్ఎస్ఏ నిధుల లభ్యత ఉంటుంది. దీంతో ఆ విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇటీవలే అందు కోసం రూ.80 కోట్లను మంజూరు చేసింది ప్రభుత్వం.

Read More: 

‘మన పాలన – మీ సూచన’లో సీఎం జగన్ కీలక పాయింట్స్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!

గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..