టైం పాస్ రెస్క్యూ ఆపరేషన్.. నిధులు మింగేందుకేనా..?

రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని చెప్పిన ధర్మాడి సత్యం టీం రోజులు గడుపుతూ వస్తోంది. కాని, బోటును మాత్రం తీయలేకపోతోంది. మొదటి సారి ఆపరేషన్ మొదలు పెట్టినప్పుడు వర్షాలు పడటం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోడంతో ప్రయత్నాన్ని ఆపివేశారు. ఇక సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్లీ ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పి హడావుడి చేయడం మొదలు పెట్టారు. రెండు రోజులుగా బోటు వెలికితీతకు కావాల్సిన సామాగ్రిని కచ్చులూరు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:57 pm, Wed, 16 October 19
టైం పాస్ రెస్క్యూ ఆపరేషన్.. నిధులు మింగేందుకేనా..?

రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని చెప్పిన ధర్మాడి సత్యం టీం రోజులు గడుపుతూ వస్తోంది. కాని, బోటును మాత్రం తీయలేకపోతోంది. మొదటి సారి ఆపరేషన్ మొదలు పెట్టినప్పుడు వర్షాలు పడటం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోడంతో ప్రయత్నాన్ని ఆపివేశారు. ఇక సరిగ్గా వారం రోజుల తర్వాత మళ్లీ ఆపరేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పి హడావుడి చేయడం మొదలు పెట్టారు. రెండు రోజులుగా బోటు వెలికితీతకు కావాల్సిన సామాగ్రిని కచ్చులూరు వద్దకు చేర్చారు. ఇక మూడవ రోజు కూడా అదే పరిస్థితి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనిపిస్తోంది. అయితే బోటు వెలికితీతకు సంబంధించిన సామాగ్రికి ప్రభుత్వమే నిధులను సమకూరుస్తోంది. ప్రభుత్వం ఇచ్చే నిధుల కోసమే.. సత్యం టీం బోటును తీయకుండా సమయాన్ని వృధా చేస్తోందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అసలు 300 అడుగులకు పైగా లోతులో మునిగిపోయిన బోటును వెలికితీయడం వీరికి సాధ్యం అవుతుందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. ఏదో మాటలు చెప్పి ప్రభుత్వ నిధులను దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉందేమోనన్న సందేహాలు మొదలయ్యాయి. కాగా బోటు ప్రమాదంలో 26 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఇప్పటివరకూ 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. అధికారులు మాత్రం ఇంకా 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు. మరోవైపు ప్రమాదానికి కారణమైన వారికోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.