రాజధానిపై క్లారిటీ.. జగన్ ప్రకటించేదేమిటి..?

ఏపీ రాజధాని అమరావతిపై రగడ రోజురోజుకు ముదురుతోంది. రాజధానిగా అమరావతిని మార్చకూడదంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన తీవ్రతరం చేస్తుండగా.. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనలు వారికి మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేందుకు సీఎం జగన్ ఎల్లుండి రాజధానికి చెందిన సీఆర్డీఏ అధికారులతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. ఇక ఆ […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:49 pm, Tue, 27 August 19
రాజధానిపై క్లారిటీ.. జగన్ ప్రకటించేదేమిటి..?

ఏపీ రాజధాని అమరావతిపై రగడ రోజురోజుకు ముదురుతోంది. రాజధానిగా అమరావతిని మార్చకూడదంటూ ఓ వైపు ఆ ప్రాంత రైతులు ఆందోళన తీవ్రతరం చేస్తుండగా.. మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేనలు వారికి మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేందుకు సీఎం జగన్ ఎల్లుండి రాజధానికి చెందిన సీఆర్డీఏ అధికారులతో సమావేశం కాబోతున్నట్లు సమాచారం.

ఇక ఆ సమావేశంలో రాజధానిపై ఏపీ సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సోమవారం ఢిల్లీ వెళ్లిన జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై కూడా ఆయనతో చర్చించి సలహాలు తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాజధానిపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తారో చూడాలి.