అన్నా క్యాంటీన్లకు విభిన్నంగా..త్వరలోనే రాజన్న క్యాంటీన్లు

సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన నుంచి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు, కేంద్రం వేస్తోన్న మొట్టికాయలు పట్టించుకోకుండానే ఆయన తన పంథాలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ప్రజల్లో మంచి స్పందన రాగా.. మరికొన్ని నిర్ణయాల పట్ల వ్యతిరేకత కూడా వచ్చింది. అలా వ్యతిరేకత వచ్చిన విషయాల్లో అన్నా క్యాంటీన్ల నిలిపివేత ఒకటి. చంద్రబాబు హయంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అన్నా […]

అన్నా క్యాంటీన్లకు విభిన్నంగా..త్వరలోనే రాజన్న క్యాంటీన్లు
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 7:53 PM

సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన నుంచి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు, కేంద్రం వేస్తోన్న మొట్టికాయలు పట్టించుకోకుండానే ఆయన తన పంథాలో పరిపాలన కొనసాగిస్తున్నారు. అయితే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల ప్రజల్లో మంచి స్పందన రాగా.. మరికొన్ని నిర్ణయాల పట్ల వ్యతిరేకత కూడా వచ్చింది. అలా వ్యతిరేకత వచ్చిన విషయాల్లో అన్నా క్యాంటీన్ల నిలిపివేత ఒకటి. చంద్రబాబు హయంలో పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ పథకాన్ని జగన్ ప్రభుత్వం ఆగష్టులో మూసివేసింది. దీనిని టీడీపీ నేతలు ఖండించారు. పేదల కడుపు కొడతారా..? అంటూ వారు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పేద ప్రజలు సైతం తమ అసంతృప్తిని వ్యక్తపరిచారు.

అయితే తాజా సమాచారం ప్రకారం అన్నా క్యాంటీన్ల స్థానంలో రాజన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే దిశగా జగన్ ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తోందట. వచ్చే ఏడాది జనవరి 1న లేదా సంక్రాంతి పండుగ నాటికి రాజన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. అంతేకాదు అన్నా క్యాంటీన్లకు విభిన్నంగా పేద ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే ప్రదేశాల్లో వీటిని పెట్టాలని జగన్ టీమ్ ప్రణాళికలు రచిస్తోందట. మొత్తానికి ఆరు నెలల్లో బెస్ట్ సీఎం అనిపించుకుంటా అని చెప్పిన జగన్ తన మీద పడ్డ నెగిటివ్ అంశాలను పాజిటివ్‌గా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సుస్పష్టంగా అర్థమవుతోంది.