ఏపీ: నవంబర్‌లో పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభం..!

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలను పూర్తిగా మార్చబోతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని అధికారులకు తెలియజేశారు.

ఏపీ: నవంబర్‌లో పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభం..!
Follow us

|

Updated on: Sep 09, 2020 | 5:14 PM

Jagan Key Decision Over Anganvadis: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలను పూర్తిగా మార్చబోతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని అధికారులకు తెలియజేశారు. కిండర్‌ గార్టెన్‌ స్కూల్స్‌లో ఉన్న పాఠ్య ప్రణాళికలను అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఇక్కడ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అంగన్‌వాడీలలో కూడా రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, తాగు నీరు, చిన్న పెద్ద మరమ్మత్తులు, విద్యుద్దీకరణ, కిచెన్, రిఫ్రిజిరేటర్, ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డు, 55 అంగుళాల టీవీ, గోడలపై పెయింటింగ్స్‌తో పాటు, ప్లే జోన్‌(క్రీడా స్థలం) ఉండేలా మార్పులు చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వైజరీ కమిటీ, కరికులమ్‌ కమిటీలు.. ఎప్పటికప్పుడు ఫుడ్, శానిటేషన్, బాత్రూమ్స్‌పై మానిటరింగ్‌ చేస్తుండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే అంగన్‌వాడీ టీచర్స్‌ ట్రైనింగ్‌ మరింత ఛాలెంజింగ్‌గా ఉండాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 27,438 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో తొలి దశలో 17,984, రెండో దశలో 9454 కేంద్రాల నిర్మాణ పనులు ఉన్నాయి. ఇక తొలి దశ పనులు ఈ ఏడాది డిసెంబరులో మొదలుపెట్టాలని, రెండో దశ పనులు వచ్చే ఏడాది నవంబరు 14న ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నాటికి స్థలాలు గుర్తింపు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీల ఏర్పాటు, మెటీరియల్‌ సేకరణ, ఇతర పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న పనులు మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల (ఎంకేఎస్‌) సూపర్‌వైజర్లు ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపకల్పన చేస్తున్నారు. కాగా, నవంబర్ రెండోవారం నుంచి పీపీ–1, పీపీ–2 స్కూళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ తెలిపారు.

Also Read:

విజయవాడ మీదుగా 24 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే..!

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్‌టైమ్‌ క్యాస్ట్ సర్టిఫికెట్‌’..

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.