అమరావతి : జగన్‌ను అడ్డు పెట్టుకొని ఏపీని దోచుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ప్రజలే కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యకర్త ఎన్నికల పోరాటానికి కమాండర్‌గా మారాలని సూచించారు. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం మంచి స్వింగ్‌లో ఉందన్నారు. కాపు రిజర్వేషన్లు తన పరిధిలో లేదని వ్యాఖ్యానించిన జగన్ మళ్లీ న్యాయం చేస్తానంటూ నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. జగన్‌ను నేరస్థుడిలా కాకుండా ఇక్కడ రాజకీయ నేతలా చలామణీ అవుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ఓ అరాచక శక్తి అనడానికి అఫిడవిట్లో పేర్కొన్న కేసులే నిదర్శనమని చంద్రబాబు అన్నారు.