నాపై కులం ముద్రవేస్తారా..?

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులన్న అంశం తెరపైకి రావడంతో.. ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అక్కడి రైతులు ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని విషయంలో కులం రంగు అంటగట్టి.. విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌‌ను కూడా అభివృద్ధి చేశానని.. నా కులం ఉందనో, నా కుటుంబం కోసమో […]

నాపై కులం ముద్రవేస్తారా..?
Follow us

| Edited By:

Updated on: Jan 02, 2020 | 5:59 AM

ఏపీ రాజకీయాలు ప్రస్తుతం హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులన్న అంశం తెరపైకి రావడంతో.. ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దంటూ అక్కడి రైతులు ఆందోళనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అమరావతి రాజధాని విషయంలో కులం రంగు అంటగట్టి.. విచ్చిన్నం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌‌ను కూడా అభివృద్ధి చేశానని.. నా కులం ఉందనో, నా కుటుంబం కోసమో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేదన్నారు. సైబరాబాద్ నిర్మించడం, సైబర్ టవర్స్ నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి ఏ కులం కోసమో కాదన్నారు. అలాంటి నాపైన కులం ముద్ర వేస్తారా అంటూ ప్రశ్నించారు.

అలాగే అమరావతిని కూడా ఒక కులం కోసమో, ఒక ప్రాంతం కోసమో నిర్మించాలనుకోలేదని.. రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన రాజధానిని అందించాలన్న సంకల్పంతో.. అన్ని ప్రాంతాలకు చేరువలో నిర్మించాలనుకున్నామన్నారు. అమరావతిని ఒక ఆర్ధిక వనరుగా తయారు చేసి, ఆ అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందించాలనుకున్నామన్నారు. అటువంటి రాజధానికి కులం రంగు పూసి విచ్చిన్నం చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. అది వైసీపీ నేతలు బుద్దిహీనతకు గుర్తని.. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని అన్నారు. అలాంటి అమరావతిని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలుగా మనందరి బాధ్యతని.. రాజధాని రైతులకు అండగా నిలిచి పోరాటానికి సిద్ధమవుదామంటూ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..