ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్!

ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రాజాసింగ్!

జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో ఆయన హిందూ ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలన రేపాయి. ప్రజలను మతాల పేరుతో విడగొడుతూ రాజకీయాలు చేసేది హిందూ రాజకీయనేతలనేని.. అంతేకాక మతాల మధ్య గొడవపెట్టేది కూడా హిందూ నాయకులేనంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇక టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది కూడా హిందువులేనని పవన్ విమర్శించారు. పవన్ చేసిన […]

Ravi Kiran

| Edited By: Srinu Perla

Dec 03, 2019 | 7:30 PM

జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమ పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరిగిన ఒక సమావేశంలో ఆయన హిందూ ధర్మంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలన రేపాయి. ప్రజలను మతాల పేరుతో విడగొడుతూ రాజకీయాలు చేసేది హిందూ రాజకీయనేతలనేని.. అంతేకాక మతాల మధ్య గొడవపెట్టేది కూడా హిందూ నాయకులేనంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇక టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది కూడా హిందువులేనని పవన్ విమర్శించారు. పవన్ చేసిన ఈ  కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచాయి. ఇక ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్..  మీరు హిందువు కాదా.? లేక ఇతర మతానికి మారిపోయారా.? అని ప్రశ్నించారు. అంతేకాకుండా మీరు పెట్టుకున్న జనసేన చిల్లర పార్టీలో హిందువులే లేరా.? అంటూ ఘాటుగా విమర్శించారు. హిందూ మతం, ధర్మంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

హిందూ మతాన్ని, ధర్మాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని.. లౌకికతత్వంపై కూడా పవన్ కళ్యాణ్‌కు సరైన అవగాహన లేదని రాజాసింగ్ దుయ్యబట్టారు. హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ‘ఖబడ్ధార్ పవన్’ అని హెచ్చరిస్తూ రాజాసింగ్ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu