ఏపీ ఉద్యోగ సంఘాలపై ఎస్ఈసీ ఆగ్రహం.. వెంకట్రామిరెడ్డిపై నిఘా పెట్టాలంటూ డీజీపీకి లేఖ

స్థానిక ఎన్నికలపై ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడి చేసిన వ్యాఖ్యలను ఎస్ఈసీ సీరియస్‌గా తీసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 7:10 pm, Sat, 23 January 21
ఏపీ ఉద్యోగ సంఘాలపై ఎస్ఈసీ ఆగ్రహం.. వెంకట్రామిరెడ్డిపై నిఘా పెట్టాలంటూ డీజీపీకి లేఖ

AP SEC letter to DGP : ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం , ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పంచాయితీ ముదురుతోంది. స్థానిక ఎన్నికలపై ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడి చేసిన వ్యాఖ్యలను ఎస్ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ఏపీ ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణాపాయం వస్తే ఎదుటివారి ప్రాణాలు తీసేహక్కు రాజ్యాంగం ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి కామెంట్ చేశారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఎదుటివారిని చంపుతానని వెంకట్రామిరెడ్డి బెదిరించారని వివరించారు. కాగా, వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలంటూ సూచించిన ఎస్ఈసీ.. అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీని నిమ్మగడ్డ కోరారు.

Read Also… ఏపీలో ఎటూ తేలని ‘పంచాయితీ’.. ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు.. రాష్ట్రస్థాయి సమావేశానికి అధికారుల గైర్హాజరు