భూముల ధరలు పెరగాలని కోరుకునేవాళ్లు రైతులెలా అవుతారు? అమరావతి ఉద్యమం గురించి ఫైర్ అయిన..

ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చే మంత్రి పేర్నినాని మరోసారి ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతి ఉద్యమం గురించి

భూముల ధరలు పెరగాలని కోరుకునేవాళ్లు రైతులెలా అవుతారు? అమరావతి ఉద్యమం గురించి ఫైర్ అయిన..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 5:42 AM

ప్రతిపక్షాలపై మాటల తూటాలు పేల్చే మంత్రి పేర్నినాని మరోసారి ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతి ఉద్యమం గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయం వదులుకొని భూముల ధరలు పెరగాలని కోరుకునేవాళ్లు రైతులు ఎలా అవుతారని ప్రశ్నించారు. నిజమైన రైతులైతే సాగుకోసం పరితపిస్తారని కానీ ఇక్కడ తమకు భూములొద్దు ప్లాట్లు కావాలని అడగడం ఎంతవరకు సమంజసం అన్నారు. ప్లాట్ల విలువ పెరగాలని కోరుకునేవాళ్లు రైతులు ఎలా అవుతారని దుయ్యబట్టారు. టీడీపీ నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే సర్టిఫికెట్ ఇక్కడ ఎవరికి అవసరం లేదని ఎగతాళి చేశారు. రాజధాని ప్రాంతంలో నిరుపేద రైతులకు, బలహీనవర్గాలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం స్థలం ఇద్దామంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇది చాలా అన్యాయం అని పేద రైతులతో ఆటలాడితే మట్టి కొట్టుకుపోతారని అన్నారు.