జూన్ 8 నుంచి ఏపీలో హోటళ్లకు అనుమతి: మంత్రి

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతులు ఇస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:21 pm, Tue, 2 June 20
జూన్ 8 నుంచి ఏపీలో హోటళ్లకు అనుమతి: మంత్రి

లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతులు ఇస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. విశాఖలో మాట్లాడిన ఆయన.. కరోనా నియమ నిబంధనలకు అనుగుణంగా హోటళ్లను నడిపే అవకాశం కల్పించబోతున్నామని అన్నారు. హోటళ్లు తిరిగి ప్రారంభం కావడంపై ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్ర హోటల్ సమాఖ్యతో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్‌ వలన మూడు నెలలుగా హోటళ్లు మూతపడటంతో యాజమాన్యం తీవ్ర ఇబ్బంది పడిందని ఆయన అన్నారు. ఇక కరోనా వైరస్‌పై తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పర్యాటక రంగ హోటళ్లు, ప్రైవేట్ హోటళ్లు, రెస్టారెంట్లు నడిపేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

Read This Story Also: నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాలకు హై అలర్ట్..!