Andhra Pradesh Government: ఏపీ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ‘స్టేటస్ కో’ని ఎత్తివేయాలని ఇప్పటికే సుప్రీం కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ కాపీని కెవియట్ వేసిన వారికి పంపామని, దీనిపై వీలైనంత త్వరగా విచారణ జరపాలని ప్రభుత్వం సుప్రీం రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది.
అయితే ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఇటీవల గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని వికేంద్రీకరన, సీఆర్‌డీఏ రద్దుపై కోర్టు స్టేటస్ కో విధించింది. ఈ స్టేటస్ కోను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.
Read This Story Also: కస్టడీ డెత్ కేసులో అరెస్ట్.. కరోనాతో మృతి చెందిన పోలీస్