పెద్ద చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా 'మన పాలన - మీ సూచన' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ...

  • Tv9 Telugu
  • Publish Date - 1:39 pm, Wed, 27 May 20
పెద్ద చదువులతోనే పేదల తలరాతలు మారుతాయి: సీఎం జగన్

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ‘మన పాలన – మీ సూచన’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో రోజుకో అంశంపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమం మే 25వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకూ జరగనుంది. కాగా ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ మూడో రోజులో భాగంగా.. సీఎం జగన్ విద్యారంగంపై ప్రత్యేకంగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా బోధన జరగాలి. పేదవాడు తన కాళ్లపై తాను నిలబడాలంటే వారికి చదువే ఆస్తి. పాఠశాలల బిల్డింగులు అధ్వాన్నంగా ఉండేవి. హైయర్ ఎడ్యుకేషనల్‌లో మన పిల్లలు వెనుకబడి ఉన్నారు. పెద్ద చదువులతోనే విద్యార్థుల తలరాతలు మారుతాయి. తొలివిడతగా 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే ఒకటి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలవుతుంది. చదివించే స్థోమత లేకనే పిల్లలను తల్లిదండ్రులు కూలి పనులకు పంపుతున్నారు. 70 శాతం మంది పిల్లలు ఇంటర్‌తోనే చదువును ఆపేయాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లల చదువుల కోసం తల్లిండ్రులు నానా కష్టాలు పడుతున్నారు. అప్పులు కూడా చేసి చదవిస్తున్నారు. ఇకపై అలాంటి కష్టం ఎవరికీ రాకూడదనే ఈ పథకాలను తీసుకొచ్చినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

Read More:

ఏపీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి లైసెన్స్ సర్వీసులు ప్రారంభం

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..