Balakrishna: పొరపాటుగా అన్నానంటూ ‘సారీ’ చెప్పిన బాలకృష్ణ.. ఇంతరీ మ్యాటర్ ఏంటంటే..

బాలకృష్ణ నాలుక కరుచుకున్నారు. తప్పైందంటూ సారీ కూడా చెప్పారు. తన వద్ద ఉన్న సమాచారం తప్పని.. మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ అభ్యర్థించారు.

Balakrishna: పొరపాటుగా అన్నానంటూ ‘సారీ’ చెప్పిన బాలకృష్ణ.. ఇంతరీ మ్యాటర్ ఏంటంటే..
Balakrishna
Follow us

|

Updated on: Jan 15, 2023 | 12:02 PM

బాలకృష్ణ నాలుక కరుచుకున్నారు. తప్పైందంటూ సారీ కూడా చెప్పారు. తన వద్ద ఉన్న సమాచారం తప్పని.. మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి అంటూ అభ్యర్థించారు. ఈ మేరకు ఒక ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేశారు. బాలయ్య ఏంటీ? క్షమాపణుల చెప్పడం ఏంటి? ఇంతకీ ఎవరికి క్షమాపణలు చెప్పారు? అసలేంటి సంగతి? అని ఆలోచిస్తున్నారా? అయితే, విషయంలోకి వెళ్లాల్సిందే..

తాజా మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ.. రావణుడు దేవబ్రాహ్మణ నాయకుడు అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనం క్రియేట్ చేశాయి. దేవాంగులు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై దేవాంగులు తమ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఇందుకు బాలకృష్ణ స్పందించారు. తన దగ్గరున్న సమాచారం తప్పని తెలుసుకున్నాననీ, దేవాంగుల్లో ఎందరో తనకు అభిమానులున్నారని అన్నారు. ‘నావాళ్లను నేనెందుకు బాధ పెడతాను. దేవాంగుల మనోభావాలు దెబ్బ తిని ఉంటే సారీ. ఆ సందర్భంలో అది అలవోకగా దొర్లిన పొరబాటుగా అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను’. అంటూ బాలకృష్ణ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..