ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏఈఈ నాగేశ్వరరావు అరెస్టు.. సెంట్రల్ జైలుకు తరలింపు

ACB Raids: ఏపీఈపీడీసీఎల్‌ ఏఈఈ నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్టు చేసి సెంట్రల్‌ జైలుకు తరలించారు..

  • Subhash Goud
  • Publish Date - 5:24 am, Sat, 30 January 21
ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏఈఈ నాగేశ్వరరావు అరెస్టు.. సెంట్రల్ జైలుకు తరలింపు

ACB Raids: ఏపీఈపీడీసీఎల్‌ ఏఈఈ నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్టు చేసి సెంట్రల్‌ జైలుకు తరలించారు. నాగేశ్వరరావుకు ఫిబ్రవరి 12 వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఇప్పటి వరకు రూ.4.6 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో రూ.20 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్‌ లాకర్‌లో 1700గ్రాముల బంగారం, రూ.41 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు గుర్తించారు. అలాగే నాగేశ్వరరావు భార్య, కొడుకు బ్యాంకు ఖాతాల్లో రూ.9 లక్షల బ్యాలెన్స్‌ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

కాగా, గురువారం నుంచి ఏసీబీ అధికారులు విశాఖ సిటీతోపాటు రాంబిల్లి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నాగేశ్వరరావుపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేపట్టింది ఏసీబీ. ఏకకాలంలో ఏడు చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగించింది.

Crime News: నకిలీ పత్రాలో కోట్లు కొల్లగొట్టాడు.. పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కయ్యాడు..