Andhra Pradesh: విషాదం నింపిన వేడుక.. నిమజ్జనం చేస్తుండగా గల్లంతు.. ఒకరు మృతి, బాలిక గల్లంతు

వినాయక చవితి పండుగ పూట ఆ ఇంట్లో తీరని విషాదం అలుముకుంది. ఇష్ట దైవాన్ని భక్తితో పూజించుకుని, ఆటపాటలతో రోజంతా ఆనందంగా గడిపిన ఆ చిన్నారులు సాయంత్రానికి ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యారు. అనంతపురం పట్టణంలోని..

Andhra Pradesh: విషాదం నింపిన వేడుక.. నిమజ్జనం చేస్తుండగా గల్లంతు.. ఒకరు మృతి, బాలిక గల్లంతు
death
Follow us

|

Updated on: Sep 01, 2022 | 11:32 AM

వినాయక చవితి పండుగ పూట ఆ ఇంట్లో తీరని విషాదం అలుముకుంది. ఇష్ట దైవాన్ని భక్తితో పూజించుకుని, ఆటపాటలతో రోజంతా ఆనందంగా గడిపిన ఆ చిన్నారులు సాయంత్రానికి ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యారు. అనంతపురం పట్టణంలోని సాయినగర్ ప్రాంతానికి చెందిన కాలనీ వాసులు గణేశ్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఉత్సవాల అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం పండుగ సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ (గురువారం) లంబోదరుడి నిమజ్జనం కోసం రాప్తాడు పండమేరు కాలువకు వెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా నీటి ప్రవాహానికి నలుగురు నీటిలో పడిపోయారు. వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. శ్రీరాములు, జయశ్రీ ప్రవాహంలో కొట్టుకు పోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. వారిలో శ్రీ రాములు మృతదేహం లభ్యం కాగా.. జయ శ్రీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా.. గల్లంతైన వారు బంధువులు కావడం మరింత ఆవేదన కలిగిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి