Andhra Pradesh: ప్రత్యేక హోదా విషయంపై హైకోర్టు లో విచారణ.. ఆయన హాజరుకు న్యాయస్థానం ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రేపుతోన్న ప్రత్యేక హోదా విషయం హైకోర్టు మెట్లెక్కింది. ప్రత్యేక హోదా విషయమై హైకోర్టులో విచారణ జరిగింది. ఎవరి సిఫార్సుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనే నిర్ణయం తీసుకున్నారనే...

Andhra Pradesh: ప్రత్యేక హోదా విషయంపై హైకోర్టు లో విచారణ.. ఆయన హాజరుకు న్యాయస్థానం ఆదేశాలు..
AP High Court
Follow us

|

Updated on: Nov 24, 2022 | 6:15 AM

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రేపుతోన్న ప్రత్యేక హోదా విషయం హైకోర్టు మెట్లెక్కింది. ప్రత్యేక హోదా విషయమై హైకోర్టులో విచారణ జరిగింది. ఎవరి సిఫార్సుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనే నిర్ణయం తీసుకున్నారనే అంశంపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదంటూ రమేష్ చంద్ర వర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా కేంద్ర సంస్థలు సరిగ్గా స్పందించడం లేదంటూ వ్యాజ్యంలో పేర్కొన్నారు. సమాచారం ఇవ్వకుండా కేంద్ర సంస్థలు తన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని చెప్పారు. ఆర్టికల్స్ 14, 19(1)ను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ తెలిపారు. హైకోర్టు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఏపీ ని తదుపరి వాయిదా కు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 25కు విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరపగా కేంద్రం, నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ఫైనాన్స్ కమిషన్ డివిజన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీకి విచారణ వాయిదా పడింది.

కాగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని సీఎం జగన్ ప్రధానికి విశాఖ సభ వేదికలో విన్నవించారు. ఆత్మవిశ్వాసం నింపడానికి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తున్నామని అన్నారు. తమ ప్రజలు ప్రేమను మాత్రం గుర్తు పెట్టుకుంటారని జగన్ అన్నారు. తమకు… రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశామన్న సీఎం.. రాష్ట్ర విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..