Andhra Pradesh: మట్టిలో మాణిక్యం.. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన బాలిక

| Edited By: Subhash Goud

Aug 05, 2023 | 8:33 PM

ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామము ఈ గ్రామంలో 600 కుటుంబాలు జీవిస్తున్నాయి వీరు వ్యవసాయంపై ఆధారపడి జీవించవలెను ప్యాపిలి మండలం వెనుకబడిన ప్రాంతం కి చెందినది ఈ ప్రాంతాము లో నల్ల రాయి కొండలు ఎక్కువగా ఉండడంతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావడం జరిగినది సిమెంట్ ఫ్యాక్టరీ ఉండడం వలన ఉపాధి కల్పిస్తుందని చుట్టుపక్కల గ్రామాలు ఉన్న కార్మికులు వారి పిల్లలను చదివించలేని..

Andhra Pradesh: మట్టిలో మాణిక్యం.. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన బాలిక
National Level Sports
Follow us on

మట్టిలో మాణిక్యం అంటే ఇదే. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జాతీయస్థాయి క్రీడలకు ఎంపికై తన సత్తా చాటింది ఓ బాలిక. కుటుంబ పోషణ కూడా కష్టంగా జరిగే ఆ కుటుంబం నుంచి బాలిక ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ జాతీయస్థాయి వరకు చేరగలిగింది. అక్కడ కూడా సక్సెస్ అయితే ఆ బాలిక భవిష్యత్తు కాదు కుటుంబం గ్రామ ప్రతిష్ట కూడా జాతీయస్థాయిలో ఇనుమడించే అవకాశం ఉంది..

ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామము ఈ గ్రామంలో 600 కుటుంబాలు జీవిస్తున్నాయి వీరు వ్యవసాయంపై ఆధారపడి జీవించవలెను ప్యాపిలి మండలం వెనుకబడిన ప్రాంతం కి చెందినది ఈ ప్రాంతాము లో నల్ల రాయి కొండలు ఎక్కువగా ఉండడంతో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుకూలంగా ఉండడంతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావడం జరిగినది సిమెంట్ ఫ్యాక్టరీ ఉండడం వలన ఉపాధి కల్పిస్తుందని చుట్టుపక్కల గ్రామాలు ఉన్న కార్మికులు వారి పిల్లలను చదివించలేని పరిస్థితులలో ఈ ఫ్యాక్టరీ రావడంతో చదువుకోడానికి పాఠశాల. ఆరోగ్యాలు బాలేక పోతే ఆస్పత్రులు, కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫ్యాక్టరీ ఉండడం వలన కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి తో బ్రతుకుతున్నాయి.

ఈ గ్రామానికి చెందిన మాబు రేష్మ దంపతుల కు ఒక కుమార్తె కుమారుడు తండ్రి మాబు రాచర్లలో ఉన్న ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు ఇతనికి ఒక ఎకరా పొలం తప్ప ఏమీ లేదు కూతురు ఆటల్లో ప్రతిభ చూపడంతో తండ్రి కూతురికి ప్రోత్సహించడమైనది నేరేడుచర్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివి అక్కడ నుండి పక్కన ఉన్న రాచర్ల గ్రామంలో ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతూ క్రీడల పై ఆసక్తితో త్రో బాల్ పోటీలో ప్రతిభ చూపించడంతో స్కూల్లోని పిటి సారు శ్రీనివాసులు ఎస్ సానియాకు ట్రైనింగ్ ఇచ్చి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కృషి చేసినాడుక్రీడల్లో ప్రతిభ చూపించినది అలాగే పదో తరగతినీ పూర్తిచేసికొని బనగానపల్లె లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది తండ్రి రాచర్ల ప్రియ సిమెంట్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు తల్లి రేష్మ గృహిణి.

ఇవి కూడా చదవండి

రేష్మ మొదటి కూతురు సానియా కు ఆటలలో ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి విజయమైన సాధించవచ్చునని నిరూపించిన సానియా ఇటు చదువులోనూ క్రీడల్లో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు సానియా ఆసక్తితో త్రోబాల్ పై ఆసక్తితో పీటీ శ్రీనివాసులు వద్ద శిక్షణ పొంది మండల జోనల్ రాష్ట్రస్థాయి క్రీడ పోటీలో తమ సైలీలో నైపుణ్యానీ ప్రదర్శించి నైపుణ్యాన్ని సాధిస్తుంది పాఠశాల స్థాయిలో అండర్ 14 విభాగంలో నవంబర్ 2022లో జరిగిన త్రో బాల్ పోటీల్లో జిల్లా స్థాయికి ఎంపికైంది డిసెంబర్లో నంద్యాలలో జరిగిన త్రో బాల్ పోటీల్లో చక్కటి ప్రతిభ చూపించడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైంది జనవరి 2023 లో నంద్యాలలోని గురురాజా పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలో పాల్గొని మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని అక్కడ అధికారుల నుంచి ప్రశంశాలు అందుకుంది సానియా జాతీయస్థాయి త్రోబల్ పోటీలో రాణించడమే తన లక్ష్యమని సానియా చెబుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి