AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు.. ఈ జిల్లాలో మాత్రం..

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర...

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు.. ఈ జిల్లాలో మాత్రం..
Corona Virus
Follow us

|

Updated on: Jun 20, 2021 | 6:40 PM

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,001 సాంపిల్స్‌ని పరీక్షించగా 5,646 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ వల్ల చిత్తూరులో పదకొండు మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడుగురు, గుంటూరు జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, కడప జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కర్నూల్‌లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఇక గడిచిన 24 గంటల్లో 7,772 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇక నేటి వరకు రాష్ట్రంలో 2,11,50,847 సాంపిల్స్ పరీక్షించగా.. 18,50,563 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 17,75,176 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63,068 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా వైరస్ తీవ్రతతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,319 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 386 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు – 890, ఈస్ట్ గోదావరి – 1,098, గుంటూరు – 309, కడప – 307, కృష్ణా – 441, కర్నూలు – 127, నెల్లూరు – 213, ప్రకాశం – 387, శ్రీకాకుళం – 396, విశాఖపట్నం – 176, విజయనగరం – 155, పశ్చిమ గోదావరి – 761 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ సడలింపు వేళలలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఉన్న సడలింపులు.. రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వనున్నారు.

Also read:

జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి కాదు…….డీలిమిటేషన్ ప్రక్రియపైనే చర్చకు ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ …?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.