ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీ-ద్విచ‌క్ర వాహ‌నం ఢీః.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

‌ప్ర‌కాశం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌ద్దిపాడు మండ‌లం ఏడుగుండ్ల‌పాడు ఫ్లైఓవ‌ర్‌పై లారీని ద్విచ‌క్ర‌వాహ‌నం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న...

ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. లారీ-ద్విచ‌క్ర వాహ‌నం ఢీః.. ముగ్గురు దుర్మ‌ర‌ణం
Anil kumar poka

|

Dec 16, 2020 | 10:46 AM

‌ప్ర‌కాశం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మ‌ద్దిపాడు మండ‌లం ఏడుగుండ్ల‌పాడు ఫ్లైఓవ‌ర్‌పై లారీని ద్విచ‌క్ర‌వాహ‌నం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ద్విచ‌క్ర వాహ‌నంపై వెళ్తున్న ముగ్గురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఈ ప్ర‌మాదంపై స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. మృతుల‌ను బల్లికుర‌వ మండ‌లం అల‌న‌డ‌క వాసులుగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

కాగా, రోడ్డు ప్ర‌మాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్ర‌మాదాలు జ‌రుగ‌కుండా పోలీసు అధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. ఏ మాత్రం ఆగ‌డం లేదు. డ్రైవ‌ర్ల నిర్ల‌క్ష్యం, నిద్ర మ‌త్తులో ఉండ‌టం, అజాగ్ర‌త్త న‌డ‌ప‌డం, అతివేగంగా న‌డ‌ప‌డం వ‌ల్ల ఎన్నో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగి అమాయ‌కులు బ‌ల‌వుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ప్ర‌తి రోజు ఏదో ఒక చోట ప్ర‌మాదాలు జ‌రుగుతూ ర‌హ‌దారులు ర‌క్త‌సిక్తంగా మారుతున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu