AP Covid: కోవిడ్ థర్డ్ వేవ్‌ కోసం ఏపీ సర్కార్ రెడీ.. ముందస్తు ఏర్పాట్లు ఇలా..

జస్ట్‌ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును ఇది ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసుల పరిస్థితి. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. జగన్ సర్కార్ వైద్య రంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్స్ పై దృష్టి సారించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అన్ని జిల్లాల వైద్య అధికారులను వైద్య ఆరోగ్య శాఖ […]

AP Covid: కోవిడ్ థర్డ్ వేవ్‌ కోసం ఏపీ సర్కార్ రెడీ.. ముందస్తు ఏర్పాట్లు ఇలా..
Ap Covid Hospitals
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 07, 2022 | 8:16 PM

జస్ట్‌ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును ఇది ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసుల పరిస్థితి. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. జగన్ సర్కార్ వైద్య రంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్స్ పై దృష్టి సారించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అన్ని జిల్లాల వైద్య అధికారులను వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ చేసింది.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు అప్రమత్తమయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఉండకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కి చికిత్స అందించే ఆస్పత్రులు వివరాలు ఇవే..

మొత్తం కోవిడ్ ఆస్పత్రులు 236

ఐసీయూ బెడ్‌లు మొత్తం 3609

నిండిన బెడ్లు 87, ఖాళీలు 3522

ఆక్సిజన్ కలిగిన ఐసియు బెడ్ లు మొత్తం 15,962

నిండిన బెడ్లు 184,ఖాళీలు 15,778

జనరల్ బెడ్లు మొత్తం 11277

నిండినవి 66, ఖాళీలు 11211

వెంటిలేటర్లు మొత్తం 1690

నిండినవి 14 ఖాళీలు 1676

ఇవి కూడా చదవండి: Dharmavaram Politics: హాట్‌ హాట్‌గా అనంతపురం రాజకీయాలు.. ధర్మవరంపై కన్నేసిన ఆ ముగ్గురు..

గుడ్‌న్యూస్.. QR కోడ్‌ని స్కాన్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు తెలుసా.. పూర్తి వివరాలు ఇవే..