ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు : వాతావరణశాఖ

ఏపీకి మరోసారి వర్ష సూచన జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది...

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీలో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు : వాతావరణశాఖ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 07, 2020 | 9:15 AM

ఏపీకి మరోసారి వర్ష సూచన జారీ అయింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఫలితంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బురేవి ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది.