తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి.. రేపు మధ్యాహ్నం ముహూర్తం ఫిక్స్..

తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపటి నుంచి డిసెంబర్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు..

  • Ravi Kiran
  • Publish Date - 8:21 am, Thu, 19 November 20
Andhra Pradesh

తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపటి నుంచి డిసెంబర్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను రేపు మధ్యాహ్నం 1.21 గంటలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. తుంగభద్ర పుష్కరాల కోసం ఇప్పటికే దాదాపు రూ. 250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

అలాగే ఈ పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలోని 23 పుష్కర ఘాట్‌ల దగ్గర 23 మంది ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా.. సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. అటు కోవిడ్ కారణంగా భక్తులకు నదీ స్నానాలు అనుమతి లేనందున.. జల్లు స్నానాల కోసం ఘాట్ల దగ్గర స్ప్రింకర్లను ఏర్పాటు చేసింది.

ఇక పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రధానం చేయించేందుకు మొత్తం 350 పురోహితులను ఎంపిక చేసి.. గుర్తింపు కార్డులు అందజేశారు. వారికి రూ. 350 ఫీజుగా నిర్ణయించారు. కాగా, భక్తులకు ప్రతీ చోటా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని.. భౌతిక దూరం పాటించేలా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించింది.

Also Read: జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!