గుడ్ న్యూస్..ఏపీలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఈ రోజు ఎన్ని వచ్చాయంటే…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 10 మంది మరణించగా..

  • Sanjay Kasula
  • Publish Date - 6:50 pm, Mon, 23 November 20
Coronavirus Cases In AP

Andhra Pradesh Corona : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 545 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,758కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 10 మంది మరణించగా.. మృతుల సంఖ్య 6,948కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,390 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 8,42,416కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 96,62,220 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 19, చిత్తూరులో 32, తూర్పు గోదావరిలో 104, గుంటూరులో 117,  కడపలో 31, కృష్ణాలో 44, కర్నూలులో 10, నెల్లూరులో 30, ప్రకాశంలో25, శ్రీకాకుళంలో 19, విశాఖలో 21, విజయనగరంలో 17, పశ్చిమ గోదావరిలో 76 కేసులు నమోదయ్యాయి.