ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,316 కరోనా కేసులు.. ఏ జిల్లాలో అధికంగా ఉన్నాయంటే…

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,316 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. ఇందులో 16,000 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,35,801 మంది…

  • Sanjay Kasula
  • Publish Date - 7:26 pm, Thu, 19 November 20
Coronavirus Cases World

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,316 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. ఇందులో 16,000 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,35,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 11 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,910కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 94.08 సాంపిల్స్‌ను పరీక్షించారు

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 60, చిత్తూరు 198, తూర్పుగోదావరి 183, గుంటూరు 206, కడప 58, కృష్ణా 196, కర్నూలు 14, నెల్లూరు 40, ప్రకాశం 43, శ్రీకాకుళం 28, విశాఖపట్నం 45, విజయనగరం 18, పశ్చిమ గోదావరి 227 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,123కి చేరింది.