ఎర్రచందనంతో వస్తువుల తయారీ.. డెలివరీ జాబితాలో ప్రముఖుల పేర్లు..!

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, మరోవైపు స్మగ్లర్లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఎర్రచందనంతో బొమ్మలు, గ్లాసులు, ఇతర వస్తువులు తయారు చేసే ముఠా అటవీశాఖ అధికారులకు చిక్కింది.

Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 25, 2020 | 2:13 PM

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా, మరోవైపు స్మగ్లర్లు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఎర్రచందనంతో బొమ్మలు, గ్లాసులు, ఇతర వస్తువులు తయారు చేసే ముఠా అటవీశాఖ అధికారులకు చిక్కింది.

ఎర్రచందనంతో తయారు చేసిన వస్తువులతో పాటు జింక చర్మాన్ని కూడా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ దగ్గర వేంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసిన అటవీశాఖ అధికారులకు ఎర్రచందనంతో చేసిన అనేక వస్తువులు కనిపించాయి. రెడ్‌ శాండల్‌తో తయారు చేసిన వినాయకుడి బొమ్మలు, గ్లాసులు, జింక చర్మం, కొమ్ములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ప్రకాశం జిల్లా నుంచి బైక్ లో నెల్లూరుకు తరలించినట్టు గుర్తించారు.

అంతేకాదు, ఈ ఎర్ర చందనంతో తయారు చేసిన బొమ్మలను ఎవరెవరికి డెలివరీ చేయాలని రాసుకున్న జాబితాను కూడా స్వాదీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. వీరు డెలివరీ చేసే లిస్ట్‌లో ప్రముఖుల పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఎర్రచందనం అక్రమ తరలింపు వ్యవహారంలో ఓ రిటైర్డ్‌ రేంజర్‌ హస్తం ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎర్రచందనంతో తయారు చేసిన వస్తువులు లభించిన ఇంటి యజమాని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అటవీశాఖ అధికారులు. మరోవైపు రెడ్‌శాండల్‌తో తయారు చేసిన వస్తువులను డెలివరీ చేసే జాబితాలో ప్రముఖుల పేర్లు ఉండటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది

టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే

KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..

టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు

ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..

విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి

వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం

కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్