ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు.. ఐదుగురికి పోస్టింగ్‌లు..!

ఏపీలో పలువురు నాన్‌కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తోన్న ఐదుగురికి పోస్టింగ్‌లు లభించాయి. మరో 20 మంది డీఎస్పీలకు ఎస్పీలుగా.. 12 మంది నాన్ కేడర్ ఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాత్రి హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం సిటీలో క్రైమ్స్‌ డీసీపీగా పనిచేస్తున్న వి.సురేష్‌ బాబును అక్కడే కొనసాగిస్తూ ఆర్‌.గంగాధర్‌రావును ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా పంపింది. […]

ఏపీలో భారీగా అదనపు ఎస్పీల బదిలీలు.. ఐదుగురికి పోస్టింగ్‌లు..!
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 8:37 AM

ఏపీలో పలువురు నాన్‌కేడర్ ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తోన్న ఐదుగురికి పోస్టింగ్‌లు లభించాయి. మరో 20 మంది డీఎస్పీలకు ఎస్పీలుగా.. 12 మంది నాన్ కేడర్ ఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాత్రి హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో విశాఖపట్నం సిటీలో క్రైమ్స్‌ డీసీపీగా పనిచేస్తున్న వి.సురేష్‌ బాబును అక్కడే కొనసాగిస్తూ ఆర్‌.గంగాధర్‌రావును ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా పంపింది. ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఓఎస్‌డీగా పనిచేసిన ఎ.వెంకటరత్నంను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా పంపింది. అలాగే మోహన్‌రావును ఇంటెలిజెన్స్‌కు, టి.గంగాధరంను కర్నూలుకు.. సీఐడీలో ఉన్న మేరీ ప్రశాంతిని విజయవాడ సిటీ అడ్మిన్‌ డీసీపీగా, రెడ్‌ శాండల్‌ టాస్క్‌ఫోర్స్‌ నుంచి వెంకట రవికుమార్‌ను ఏసీబీ జేడీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక ఏపీ ఎస్పీ మూడో బెటాలియన్‌ కమాండెంట్‌ శ్రీరామమూర్తిని 14వ బెటాలియన్‌కు, మరో కమాండెంట్‌ నాగరాజును హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌కు, వెయిటింగ్‌లో ఉన్న సత్తిబాబును ఏసీబీకి బదిలీ చేశారు. వీరితో పాటు వెయిటింగ్‌లో ఉన్న అడిషనల్‌ ఎస్పీ సుప్రజను తిరుపతి అడ్మిన్‌కు, అడిషనల్‌ డీసీపీ ఎం. రజనీని విశాఖ సిటీకి పంపిన ప్రభుత్వం.. ఏసీబీలో ఫైర్‌బ్రాండ్‌గా పనిచేసిన ఎ.రమాదేవిని విశాఖపట్నం మెరైన్‌కు బదిలీ చేసింది. కాగా ఇంటెలిజెన్స్‌లో ఉన్న కరీముల్లా షరీఫ్‌ను పశ్చిమ గోదావరి అడ్మిన్‌గా, వెయిటింగ్‌లో ఉన్న చౌడేశ్వరికి మార్కాపురం ఓఎస్‌డీగా పోస్టింగ్ ఇచ్చింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..