ఏపీ : రహదారుల రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు

రహదారుల రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. టెండర్ల దాఖలు కోసం చెల్లించాల్సిన బ్యాంకు గ్యారెంటీల విషయంలోనూ…

  • Ram Naramaneni
  • Publish Date - 10:56 pm, Sat, 10 October 20

రహదారుల రివైజ్డ్​ బిడ్డింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. టెండర్ల దాఖలు కోసం చెల్లించాల్సిన బ్యాంకు గ్యారెంటీల విషయంలోనూ వెసులుబాటు కల్పిస్తూ రహదారులు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర దేశాల్లో ఉన్న భారత జాతీయ బ్యాంకుల నుంచి లేదా జాతీయ బ్యాంకుల కౌంటర్ హామీతో విదేశీ బ్యాంకుల గ్యారెంటీల చెల్లుబాటును గవర్నమెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ అంశాలను టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తూ రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు విడుదల చేశారు చేశారు. గతంలో తక్కువ బిడ్లు దాఖలు కావటంతో రహదారుల టెండర్లను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6400 కోట్లతో 3 వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని నిర్ణయించారు.

Also Read  : ఖమ్మం జిల్లా : ఆ ఊరిలో 20 రోజుల్లో 12 మరణాలు