108 లేటవుతుందేమో… నా కారెక్కించండి..మంత్రి పెద్ద మనసు

Andhra pradesh minister anil kumar yadav helps accident victims in nellore, 108 లేటవుతుందేమో… నా కారెక్కించండి..మంత్రి పెద్ద మనసు

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసి తన పెద్ద మనసు చేసి చాటుకున్నారు  ఏపీ ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్. ప్రమాద బాధితుల్ని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ అనుచరులను ఆదేశించారు. ఈలోపే 108 వాహనం అక్కడికి చేరుకోవడంతో.. బాధితుల్ని దగ్గరుండి వాహనంలోకి ఎక్కించి ఆస్పత్రికి పంపే వరకు అక్కడే ఉన్నారు.

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం ఉదయం నెల్లూరు నుంచి.. అమరావతిలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు బయల్దేరారు. హైవేపై కాన్వాయ్ వెళుతుండగా.. దారి మధ్యలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని గమనించాడు. వెంటనే కారును ఆపి.. ప్రమాదంపై ఆరా తీశారు. అప్పటికే స్థానికులు 108కి ఫోన్ చేశారు. అది వచ్చేసరికి లేటవుతుందేమోనన్న సందేహంతో తన కారులో బాధితుల్ని ఆస్పత్రికి తరలించాలని మంత్రి సూచించారు. కానీ ఈలోపే 108 వాహనం రావడంతో.. మంత్రి అనుచరులు దగ్గరుండి ప్రమాద బాధితుల్ని వాహనంలోకి ఎక్కించి.. ఆస్పత్రికి పంపించారు. మంత్రి అనిల్ ఘటనా స్థలంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయన్ను పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *