జగన్‌ ప్రభుత్వానికి భంగపాటు తప్పదా..? లోకేష్ వ్యాఖ్యలు సంకేతాలా..?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు భంగపాటు తప్పేలా లేదు. సోమవారం ఏపీ రాజధాని మార్పుకు సంబంధించిన బిల్లు.. శాసనసభలో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఈ బిల్లు శాసనమండలిలో కూడా ఆమోదం పోంది.. నెగ్గితేనే.. ఈ అంశం ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది. అయితే మండలిలో ఈ బిల్లు నెగ్గడం ఇప్పుడు అంత ఈజీ కాదు. దీనికి కారణం జగన్ సర్కార్‌కు మండలిలో తగినంత బలం లేకపోవడమే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్న టీడీపీకి మండలిలో బలం ఉండటం.. […]

జగన్‌ ప్రభుత్వానికి భంగపాటు తప్పదా..? లోకేష్ వ్యాఖ్యలు సంకేతాలా..?
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2020 | 9:42 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు భంగపాటు తప్పేలా లేదు. సోమవారం ఏపీ రాజధాని మార్పుకు సంబంధించిన బిల్లు.. శాసనసభలో ఆమోదం పొందింది. అయితే ఇప్పుడు ఈ బిల్లు శాసనమండలిలో కూడా ఆమోదం పోంది.. నెగ్గితేనే.. ఈ అంశం ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది. అయితే మండలిలో ఈ బిల్లు నెగ్గడం ఇప్పుడు అంత ఈజీ కాదు. దీనికి కారణం జగన్ సర్కార్‌కు మండలిలో తగినంత బలం లేకపోవడమే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటున్న టీడీపీకి మండలిలో బలం ఉండటం.. అదే సమయంలో అటు బీజేపీ, ఇతరులు కూడా అమరావతికే జైకొట్టడం చూస్తే.. బిల్లును వ్యతిరేకించే వారే ఎక్కువ ఉన్నారు. దీంతో మండలిలో ఈ బిల్లును నెగ్గించుకోవడంలో జగన్‌కు భంగపాటు తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రాజధాని మార్పు బిల్లు ఇవాళ మండలికి చేరబోతోంది. మండలిలో ఈ బిల్లును ఆమోదం పొందనీయకుండా టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. మండలిలోకి బిల్లు చేరిన అనంతరం టీడీపీ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.ఇప్పటికే సోమవారం శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును తిరస్కరించి.. వెనక్కు పంపడం మొదటి ప్రత్యామ్నాయం. ఒకవేళ ఇదే జరిగితే శాసనసభలో బిల్లును మరోసారి ఆమోదించి మళ్లీ మండలికి పంపుతారు. ఆ తర్వాత మండలికి మరోసారి వచ్చిన సమయంలో.. బిల్లును రిజెక్ట్ చెయ్యకుండా..సెలెక్ట్‌ కమిటీకి పంపుతారు. ఇది టీడీపీ ముందు ఉన్న రెండో ప్రత్యామ్నాయం. అలా కాకుండా.. బిల్లు మొదటిసారి వచ్చినప్పుడే సెలక్ట్‌ కమిటీకి పంపడం మూడో ప్రత్యామ్నాయం. అయితే బిల్లును ఒకవేళ సెలెక్ట్‌ కమిటీకి పంపితే.. అక్కడ రెండు మూడు నెలలపాటు ఆపే ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు బిల్లు ఆమోద ప్రక్రియ పూర్తి కాదు. ఈ ఆప్షన్స్‌లో దేనిని ఎన్నుకోవాలన్నదానిపై టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే టీడీపీ ఈ నిర్ణయం తీసుకోకుండా.. జగన్ సర్కార్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ కుదరని పక్షంలో ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆర్డినెన్స్ తర్వా ఆరు నెలల్లోపు దానికి అసెంబ్లీ ఆమోదం లభించాలి. కానీ ఆర్డినెన్స్ జారీకి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. కానీ గవర్నర్ దాన్ని కేంద్రం పరిశీలనకు పంపాలని నిర్ణయిస్తే.. మళ్లీ అక్కడ కూడా మరింత ఆలస్యం అవుతుంది. ఒకవేళ ఏ అడ్డంకులు లేకుండా ఆర్డినెన్స్‌ జారీ అయితే.. అప్పుడు విషయం కోర్టుమెట్లెక్కే అవకాశం ఉంది. ఇదంతా చూస్తే.. రాజధాని మార్పు బిల్లు.. మండలిలో నెగ్గడం అంత ఈజీ మాత్రం కాదు. మరోవైపు ఇదే అంశంపై నారా లోకేష్ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. బిల్లు మండలిలో ఎలా నెగ్గుతుందో చూస్తానంటూ సవాల్ కూడా విసిరారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్