ఏపీలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు.. వాటికి కూడా అనుమతులు..

ఏపీలో ఇప్పటికే పలు లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది. ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. 50 శాతం సీట్లతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణీకులకు అనుమతి ఇచ్చింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏపీ […]

ఏపీలో మరిన్ని లాక్‌డౌన్ సడలింపులు.. వాటికి కూడా అనుమతులు..
Follow us

|

Updated on: May 30, 2020 | 8:18 AM

ఏపీలో ఇప్పటికే పలు లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. తాజాగా మరిన్ని సడలింపులను ప్రకటించింది. ముఖ్యంగా రవాణా రంగానికి ఈ మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. 50 శాతం సీట్లతో ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ప్రయాణీకులకు అనుమతి ఇచ్చింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో చాలావరకు మినహాయింపులు ఇచ్చింది. కొద్దిరోజులు క్రితమే ఆర్టీసీ బస్సులు సైతం రోడ్డెక్కాయి. అటు స్ట్రీట్ వెండర్స్‌కు కూడా జగన్ సర్కార్ షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి పరీక్షలు చేశాకే అనుమతి..