‘స్విస్ చాలెంజ్‌‌’ ఒప్పందాలకు గ్రహణం

Swiss Challenge, ‘స్విస్ చాలెంజ్‌‌’ ఒప్పందాలకు గ్రహణం

స్విస్ చాలెంజ్ పేరుతో రాజధాని కోసం రైతుల భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించారని.. ఆ ఒప్పందాలను సమీక్షించి అవసరమైతే కేటాయింపులు రద్దు చేస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి బలవంతంగా తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందని.. దళితులను సాగు చేసుకుంటున్న అసైన్డ్, సీలింగ్, లంక భూములను కారుచౌకగా తీసుకునేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. స్విస్ చాలెంజ్ అవకతవకలపై కావాలంటే ఏ కోర్టుకైనా వెళతామని ఆయన చెప్పుకొచ్చారు.

రాజధాని భూమి కొనుగోళ్లలో జరిగిన అవకతవకలు, టీడీపీ నాయకులు పాల్పడిన భూ కుంభకోణాలపై అవసరమైతే సీబీఐ విచారణ కోరతామని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజధాని పరిధిలోని రైతులు, వ్యవసాయ కూలీలు, పేదలు తెలిపిన సమస్యలను సీఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపుతామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే అమరావతి నిర్మాణం కోసం సింగపూర్‌కు చెందిన కంపెనీతతో గత టీడీపీ ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *