లాటరీ పద్ధతిలో ఇంటి స్థలాలు.. ఏపీ ప్రభుత్వం కొత్త విధానం

ఉగాది నాటికి 25 లక్షల మంది ఇంటిస్ధలం పట్టాల పంపిణీ ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

లాటరీ పద్ధతిలో ఇంటి స్థలాలు.. ఏపీ ప్రభుత్వం కొత్త విధానం
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2020 | 9:14 AM

ఉగాది నాటికి 25 లక్షల మంది ఇంటిస్ధలం పట్టాల పంపిణీ ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్న ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఏపీ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి స్థలాలకు సంబంధించి ఇప్పటికే గ్రామ, వార్డు వారీగా అర్హులైనవారి జాబితా సిద్ధంగా ఉండగా.. బుధవారం నుంచి లాటరీ పద్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వారందరికీ ఈ నెల 15 నుంచి పట్టాల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించాలని.. ఈ నెల 25న రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను లబ్దిదారులకు అందించాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి. ఉషా రాణి తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకినాడ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించేలా రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఉగాది నాటికి 25 లక్షల మంది ఇంటిస్ధలం పట్టాల పంపిణీ చేపట్టాల్సిందేనంటూ తన ఉత్తర్వుల్లో ఆమె స్పష్టం చేశారు.ఈ మేరకు జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని ఉషా రాణి ఆదేశించారు.