దేవాలయాలకు సంబంధించి జగన్ మరో సంచలన నిర్ణయం

Andhra Pradesh Government issues order for 50 percent reservation on Temple Trust Boards, దేవాలయాలకు సంబంధించి జగన్ మరో సంచలన నిర్ణయం

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు సంచలనాలు తీసుకున్న జగన్ ప్రభుత్వం తాజాగా దేవాలయాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ హిందూ ధార్మిక సంస్థల నియామక చట్టంలో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టుల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మొత్తం నామినేటెడ్ సభ్యుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకమండలి సభ్యులను 16 నుంచి 25కు పెంచుతూ ఇటీవలే కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇక తాజా నిర్ణయంతో టీటీడీ పాలక మండలిలో కూడా 50శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దక్కే అవకాశం ఉండనుంది. అందులోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలు కాబోతుంది. దీనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *