ప్రభుత్వ చీఫ్‌ విప్‌, విప్‌ హోదాలు రద్దు

 అమరావతి :శాసనమండలి.. శాసన సభల్లో ప్రభుత్వ చీఫ్ విప్, విప్ హోదాలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామాతో మంత్రి మండలి కూడా రద్దైంది. తాజాగా శాసనసభతో పాటు మండలిలోనూ ప్రభుత్వ విప్ ల హోదాలను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు ఇచ్చారు. మే 25 తేదీ నుంచే వీరి హోదాలు రద్దయినట్టు పేర్కోంటూ గెజిట్ నోటిఫికేషన్ ను ఇచ్చారు. ఈ ఉత్తర్వులతో శాసన సభలో చీఫ్ విప్ గా పల్లె రఘునాధ రెడ్డి, విప్ లుగా చింతమనేని ప్రభాకర్, కూనరవికుమార్, యామినీబాల, పీజీవీఆర్ నాయుడు, అత్తార్ చాంద్ బాషాలు హోదా కోల్పోయారు. మండలిలో పయ్యావుల కేశవ్ చీఫ్ విప్ గా, విప్ లుగా డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్దావెంకన్నలు హోదా కోల్పోయారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ, శాసనసభ సమావేశం అనంతరం ఇరు సభల్లోనూ నూతన చీఫ్ విప్ లు, విప్ ల నియామకం జరుగనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *