ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ నియామకం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మూడు రాజధానిల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని దూకుడు మీదున్న సీఎం.. ఇక జిల్లాలను కూడా పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ నియామకం
Follow us

|

Updated on: Aug 07, 2020 | 6:11 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మూడు రాజధానిల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని దూకుడు మీదున్న సీఎం.. ఇక జిల్లాలను కూడా పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఏపీ కేబినెట్‌ నిర్ణయం మేరకు కమిటీ ఏర్పాటు చేశారు. సీఎస్‌ నీలం సాహ్ని కమిటీకి అధ్యక్షత వహించనున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల బౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కమిటీలో సభ్యులుగా ఆరు శాఖల అధికారులు ఉంటారు. కొత్త జిల్లా రూపకల్పనను పూర్తి చేసి మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం గడువు విధించింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై ఇటీవల మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో 13 జిల్లాలను 25 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రజలకు జిల్లా యంత్రాంగం మరింత దగ్గర కానుంది.

కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న సీనియర్‌ ఎవరు ??
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్