Eluru Mystery Disease Live Updates: వింత వ్యాధికి కారణం తాగునీటిలో అధిక క్లోరిన్! వెల్లడించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదిక?

| Edited By: Ravi Kiran

Updated on: Dec 11, 2020 | 1:51 PM

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు.

Eluru Mystery Disease Live Updates: వింత వ్యాధికి కారణం తాగునీటిలో అధిక క్లోరిన్! వెల్లడించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదిక?

Eluru Mystery Disease: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరం వింత వ్యాధితో వణికిపోతోంది. ప్రజలందరు అల్లకల్లోలం అవుతున్నారు. నీళ్లు తాగాలన్నా, తిండి తినాలన్నా, చివరకు పిల్లలకు పాలు ఇవ్వాలన్నా భయపడుతున్నారు. ఇప్పటివరకు 500 మందికి పైగానే ఆస్పత్రిలో చేరారు. ముగ్గురు మృతిచెందారు. ఈ వ్యాధికి గల కారణాలు ఏంటన్న దానిపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. దీనిపై ఎన్‌ఐఎన్, ఐఐసీటీ, ఎయిమ్స్‌ ఢిల్లీ, ఎయిమ్స్‌ మంగళగరి, డబ్ల్యూహెచ్‌ఓ, సీసీఎంబీకి చెందిన నిపుణులు సాంపిల్స్ సేకరించి అధ్యయనం చేస్తున్నారు. ఇవాళ వింత వ్యాధికి గల కారణాలను వెల్లడిస్తామని తెలిపారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Dec 2020 12:40 PM (IST)

    క్లోరిన్ అధికమోతాదులో ఉందని వెల్లడించిన భూగర్భ జల శాఖ

    ఏలూరులో భూగర్భ జల శాఖ సాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించింది. ఇందులో క్లోరిన్ అధికమోతాదులో ఉందని వెల్లడించింది. మున్సిపల్ ట్యాప్ వాటర్ సాంపిల్స్ సైతం సేకరించి పరీక్షలు జరిపింది. తాగు నీటిలో ఉండాల్సిన దాని కంటే ఎక్కువ మోతాదు క్లోరిన్ ఉన్నట్లు గుర్తించింది. బాధిత ప్రాంతాల్లో 12 చోట్ల సాంపిల్స్ సేకరించి ఈ ఫలితాలను ప్రకటించింది.

  • 11 Dec 2020 12:34 PM (IST)

    నివేదికలు సిద్ధం చేసిన కేంద్ర బృందాలు..

    డైక్లోరో మీథేన్ ఎక్కువగా రూం స్ప్రే, హేర్స్‌ స్ప్రే లలో ఎక్కువగా వాడుతారు. ఇది ఏ రూపంలోనైనా శరీరంలోకి వెళ్తే ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయని కేంద్ర బృందాలు వెల్లడించాయి. తాగునీటిలో ఈ రసాయనాలు కలవడం వల్లే ఇంతమంది అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్య బృందాలు అన్ని నివేదికలు సిద్ధం చేశాయి. దీంతో వింత వ్యాధికి గల కారణాలు ఎంటో తెలుస్తుంది. ఆ తర్వాత వ్యాధి కారకాలు తాగునీటిలోకి ఎలా చేరాయనేది తేలాల్సి ఉంది.

  • 11 Dec 2020 12:25 PM (IST)

    ఫతేబాద అనే ప్రాంతంలో అత్యధికంగా డైక్లోరో మిథేన్..

    ఇప్పటి వరకు తాగునీటిలో లెడ్, నికెల్ మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. కానీ ఫతేబాద అనే ప్రాంతంలో సేకరించిన నీటి నమూనాల్లో ఏకంగా 960 మైక్రోగ్రాముల డైక్లోరో మిథేన్ ఉందని గుర్తించారు. అశోక్‌నగర్‌లో 618 మైక్రోగ్రాములు ఉందన్నారు. సాధారణంగా డైక్లోరో మిథేన్ మోతాదుకు మించి ఉంటే వాంతులు, నోటినుంచి నురగ, ఫిట్స్, కళ్లుతిరగడం కనిపిస్తాయి.

  • 11 Dec 2020 12:19 PM (IST)

    ఏలూరులోని ఒకటో టౌన్‌లో అత్యధిక కేసులు..

    ఇప్పటి వరకు ఏలూరులోని ఒకటో టౌన్‌లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. 40 ప్రాంతాలకు విస్తరించిన ఈ వింతవ్యాధి జనాలను ఆగమాగం చేస్తోంది. దాదాపుగా 607 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. ఏలూరుకే పరిమితమైన కేసులు కేసులు ఇప్పుడు పరిసర గ్రామాలకు విస్తరిస్తున్నాయి.

  • 11 Dec 2020 12:12 PM (IST)

    వర్చువల్‌గా కారణాలను తెలియజేయనున్న కేంద్ర బృందాలు..

    కేంద్ర బృందాలు అన్ని కలిసి ఎవరి నివేదికను వారు సీఎం జగన్‌కు నివేదించనున్నారు. వర్చువల్‌గా కారణాలను తెలియజేస్తారు. ఆ తర్వాత వీటిపై పరిశోధన కొనసాగనుంది. వ్యాధికి ఎలా విరుగుడు కనిపెట్టాలే దానిపై కమిటీ వేసి విధి విధానాలను ప్రకటిస్తారు.

  • 11 Dec 2020 12:06 PM (IST)

    ఒక్కో అంశంపై ఒక్కో బృందం పరిశోధన..

    సీసీఎంబీ అధ్యయన బృందం జీవకణాలపై పరిశోధనలు చేస్తోంది. Ncdc బృందం వ్యాధి సంక్రమణ గురించి అధ్యయనం చేస్తోంది. Nin బృందం ఆహార పదార్ధాలు, తాగునీటిపై పరిశోధనలు చేస్తోంది. ఇక ఎయిమ్స్ బృందం ఇప్పటికే రక్త నమూనాలను సేకరించి అందులో భార లోహాలు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా ఎవరికి వారు విశ్లేషణ చేస్తున్నారు.

  • 11 Dec 2020 11:57 AM (IST)

    వేరు వేరుగా కారణాలను విశ్లేషిస్తున్న వైద్య బృందాలు

    వింతవ్యాధిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆరు అధ్యయన బృందాలను ఏలూరు పంపించింది. ఈ బృందాలు దాదాపుగా 70 సాంపిల్స్ సేకరించాయి. ఏ సంస్థకు ఆ సంస్థ వేరు వేరుగా కారణాలను విశ్లేషిస్తున్నాయి. ఇందులో ఒక్కో సంస్థ ఒక్కో కారణాన్ని చెబుతోంది.

  • 11 Dec 2020 11:44 AM (IST)

    వింత వ్యాధికి ప్రమాదకరమైన రసాయనాలే కారణమా?

    ఏలూరులో జలమే గరళమైందని వాపోతున్నారు స్థానికులు. తాగునీటిలో ప్రమాదకర రసాయనాలు ఉండటం వల్లే ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని అంటున్నారు. డైక్లోరో మీథేన్ ఎక్కువగా ఉండటం వల్ల వాంతులు, కళ్లు తిరగటం, ఫిట్స్ లక్షణాలు ఉంటున్నాయన్నారు. అయితే కొన్ని గంటల్లో వైద్యబృందాలు కారణాలను తెలియజేస్తాయి.

  • 11 Dec 2020 11:36 AM (IST)

    ఏలూరు ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువగా ఉన్న డైక్లోరో మిథేన్

    సాధారణంగా డైక్లోరో మీథేన్ ఒక లీటరు నీటిలో 5 మైక్రో గ్రాముల వరకు ఉంటే ఏం పర్వాలేదు. అంతకు మించితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యాధికారులు హెచ్చిరిస్తున్నారు. కాగా ఏలూరు ప్రాంతంలో 900 మైక్రోగ్రామలకు మించి డైక్లోరో మిథేన్ ఉందని ప్రకటించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

  • 11 Dec 2020 11:27 AM (IST)

    కారణాలను వెల్లడించిన తర్వాతే ఇతర ప్రాంతాలపై దృష్టి

    వింత వ్యాధికి గల కారణాలను ప్రకటించిన తరవాత ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తామని కేంద్ర వైద్య బృందాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏలూరు నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాధి ఎలా విస్తరిస్తుందో ట్రాక్ చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

  • 11 Dec 2020 11:22 AM (IST)

    హైదరాబాద్ ల్యాబ్‌లో బయటపడ్డ డైక్లోరో మీథేన్

    ఏలూరు నగరంలోని ఇరవై ప్రాంతాల్లో సేకరించిన నీటి నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కి పంపించారు. అక్కడ వాటర్ సాంపిల్స్ పై అన్ని రకాల టెస్ట్‌లు జరిగాయి. ఈ టెస్ట్‌లో ఓ షాకింగ్ నిజం బయటికొచ్చింది. ఆ వాటర్‌లో డైక్లోరో మీథేన్ ప్రమాద స్థాయిలో ఉందని వైద్యులు గుర్తించారు.

  • 11 Dec 2020 11:18 AM (IST)

    వింత వ్యాధి కారకాలలో తెరపైకి మరో కొత్త పేరు

    మిస్టరీగా మారిన వింత వ్యాధికి బాధితుల రక్తంలో సీసం, నికెల్ లాంటి భారలోహాలు ఉండటమే కారణమని తొలుత అనుకున్నారు. ఆ తర్వాత ఆర్గానో క్లోరిన్స్ ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అదే డైక్టోరో మీథేన్ అంటున్నారు.

  • 11 Dec 2020 11:12 AM (IST)

    తగ్గినట్టే తగ్గి విస్తరిస్తున్న వింత కేసులు

    ఏలూరులో తగ్గినట్టే తగ్గుతున్న వింతవ్యాధి కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా పరిసర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దెందుళూరు, సీతంపేట, మాదేపల్లిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొని ఉంది.

  • 11 Dec 2020 11:08 AM (IST)

    అధికారులతో సీఎం జగన్ సమీక్ష

    ఏలూరులోని వింత వ్యాధిపై ఈరోజు స్పష్టత రానుంది. జాతీయ సంస్థలు ఇచ్చే పరిశోధన పత్రాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం సీఎం జగన్‌కు వైద్య బ‌ృందాలు వ్యాధికి సంబంధించిన కారణాలను తెలియజేస్తాయి. కాసేపట్లో దీనిపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించనున్నారు.

  • 11 Dec 2020 11:02 AM (IST)

    పరిశోధనలు కొనసాగిస్తున్న కేంద్ర వైద్య బృందాలు

    కేంద్ర ప్రభుత్వం వింతవ్యాధిపై అధ్యయనం చేయడానికి కొన్ని విభాగాల నుంచి వైద్య బృందాలను ఏలూరుకు పంపించాయి. అందులో మంగళగిరి ఎయిమ్స్‌ బృందం, ఏఐఏ బృందం, ఐపీఎం, ఐఆర్‌సీఐ బృందాలు ప్రస్తుతం బాధితులకు అందే వైద్యంతోపాటుగా కోలుకున్న వారి స్థితిగతులను తెలుసుకుంటున్నాయి. ఆహార పదార్థాలు, పాలు, కూరగాయలు, నివసించే ప్రాంతాల్లో ఉండే మట్టినీ పరీక్షిస్తున్నాయి. నీరు వచ్చే ప్రాంతాలు, పంట ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నాయి.

  • 11 Dec 2020 10:57 AM (IST)

    ప్రస్తుతం ఏలూరులో అధ్యయనం చేస్తున్న వైద్య నిపుణుల బృందాలు

    ప్రస్తుతానికి ఏలూరులోనే వైద్య నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురైన కారణాలను విశ్లేషిస్తున్నారు. తాగునీరు, రోజు వాడే పాల సాంపిల్స్ సేకరించి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ప్రజలు అధైర్యపడొద్దని సూచిస్తున్నారు.

  • 11 Dec 2020 10:46 AM (IST)

    వింతవ్యాధి బాధితులకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటు

    ఏలూరులో వింతవ్యాధి బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పటి వరకు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 47 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరు, విజయవాడ ఆస్పత్రుల్లో మరో 34 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు ఏర్పరిచి నిత్యం ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు వైద్యులు.

  • 11 Dec 2020 10:39 AM (IST)

    హెవీ మెటల్స్, ఆర్గానో క్లోరిన్‌లలో ఏది ప్రధాన కారణమో ఇవాళ తేలనుంది..

    ఏలూరు వింత వ్యాధిపై రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. Aims , icmr- Nin, Ncdc , uit సంస్థల ప్రాథమిక నివేదిక ఈ రోజు రానుంది. హెవీ మెటల్స్, ఆర్గానో క్లోరిన్‌లలో ఏది ప్రధాన కారణమో తెలుస్తుంది. మధ్యాహ్నం వర్చ్యువల్ సమావేశాల ద్వారా ముఖ్యమంత్రి జగన్‌కు వివరించనున్నాయి.

  • 11 Dec 2020 10:28 AM (IST)

    ఏలూరు వింత వ్యాధి.. తెరపైకి మరో కొత్త విషయం..

    మొదట బాధితుల రక్తంలో సీసం, నికెల్‌ లాంటి లోహాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మరో కొత్త పేరు డైక్లోరో మిథేన్‌ అంటున్నారు. దీనిపై సీఎం జగన్ స్పందించి వెంటనే దీనికి గల కారణాలను తెలుసుకోవాలని కేంద్ర వైద్య బృందాలను కోరారు.

Published On - Dec 11,2020 12:40 PM

Follow us
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..