నేడు చంద్రగిరిలో సేమ్ సీన్!

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా 2 వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేయగా.. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 5 గురు అడిషనల్ ఎస్పీలు, 21 మంది డీఎస్పీలు, 79 మంది సీఐలు, 155 మంది ఎస్ఐలతో పాటు డ్రోన్ కెమెరాలు, రక్షక్ మొబైల్ శక్తి టీంలు పని చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *