ఈ నెల 22న చంద్రబాబు నామినేషన్‌!

కుప్పం: టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈనెల 22న కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విదియ తిథితో కూడిన శుక్రవారంతో పాటు ఆరోజున మూహుర్తం కూడా చంద్రబాబుకు అనుకూలించడంతో నామినేషన్‌ వేయడానకి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే గత మూడు ఎన్నికలలో స్వయంగా వచ్చి చంద్రబాబు నామినేషన్‌ వేయలేదు. ఆయన తరఫున పార్టీలోని స్థానిక నేతలే ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా […]

ఈ నెల 22న చంద్రబాబు నామినేషన్‌!
Follow us

|

Updated on: Mar 19, 2019 | 3:31 PM

కుప్పం: టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈనెల 22న కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విదియ తిథితో కూడిన శుక్రవారంతో పాటు ఆరోజున మూహుర్తం కూడా చంద్రబాబుకు అనుకూలించడంతో నామినేషన్‌ వేయడానకి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే గత మూడు ఎన్నికలలో స్వయంగా వచ్చి చంద్రబాబు నామినేషన్‌ వేయలేదు. ఆయన తరఫున పార్టీలోని స్థానిక నేతలే ఆ ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ కుప్పం వచ్చి తండ్రి తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈసారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు తరఫున నామినేషన్‌ దాఖలు చేయడానికి ఆహ్వానిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాలేకపోయిన పక్షంలో గతంలో మాదిరే టీడీపీకి చెందిన స్థానిక ముఖ్యులు అధినేత తరఫున నామినేషన్‌ పత్రాలు ఎన్నికల అధికారులకు సమర్పిస్తారని తెలుస్తుంది.