మహిళలకే అగ్రతాంబూలం..సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలతో దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఊహించని విధంగా ప్రజారంజక  నిర్ణయాలు తీసుకంటూ ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నారు సీఎం. తాజాగా మహిళలకు లబ్ధి చేకూరేలా..ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లాస్థాయిలో 50శాతం మహిళలకే ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. కాగా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు శాలరీస్ ఇచ్చే క్రమంలో.. అక్రమాలు , అవకతవకలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో..వాటిని అరికట్టేందుకు నేడు సీఎం ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్ కార్పోరేషన్‌ను ప్రారంభించారు. అంతేకాదు..మధ్యవర్తులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడానికి..’ఏపీ కార్పోరేషన్ ఫర్ […]

మహిళలకే అగ్రతాంబూలం..సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Nov 12, 2019 | 3:59 PM

సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలతో దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఊహించని విధంగా ప్రజారంజక  నిర్ణయాలు తీసుకంటూ ప్రత్యర్థులకు షాక్ ఇస్తున్నారు సీఎం. తాజాగా మహిళలకు లబ్ధి చేకూరేలా..ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో జిల్లాస్థాయిలో 50శాతం మహిళలకే ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. కాగా ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు శాలరీస్ ఇచ్చే క్రమంలో.. అక్రమాలు , అవకతవకలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో..వాటిని అరికట్టేందుకు నేడు సీఎం ఆంధ్రప్రదేశ్ ఔట్‌సోర్సింగ్ కార్పోరేషన్‌ను ప్రారంభించారు. అంతేకాదు..మధ్యవర్తులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడానికి..’ఏపీ కార్పోరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ ఎంప్లాయిస్‌’ పేరుతో వెబ్‌సైట్‌ను సైతం ఏర్పాటుచేశారు. వీటి ద్వారా పూర్తి స్థాయిలో పారదర్శకంగా  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు, ఇతర బెనిఫిట్లు అందనున్నాయి.

ఔట్ సోర్సింగ్  ఉద్యోగుల కోసం సీఎం జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు:

  • ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందినవారు 50 శాతం మంది ఉండేలా చర్యలు
  • అందులో కూడా జిల్లాస్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకు దక్కేలా ప్రతిపాదనలు
  • డిసెంబర్ 15కల్లా ఉద్యోగుల జాబితా…జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్ ఆర్డర్స్