ఏపీ: రేపటి నుంచి 8వ తరగతి విద్యార్ధులకు తరగతులు.. వారికి మాత్రం సంక్రాంతి తర్వాతే..

ఏపీలో స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. రేపటి నుంచి 6,7,8 తరగతుల విద్యార్ధులకు క్లాసులు ప్రారంభం కావాల్సి…

  • Ravi Kiran
  • Publish Date - 7:00 am, Sun, 22 November 20
Andhra Pradesh

Andhra Pradesh: ఏపీలో స్కూళ్ల రీ-ఓపెన్ షెడ్యూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. రేపటి నుంచి 6,7,8 తరగతుల విద్యార్ధులకు క్లాసులు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. కేవలం 8వ తరగతి విద్యార్ధులకు మాత్రమే తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మరోవైపు రేపటి నుంచి పదో తరగతి విద్యార్ధులకు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు క్లాసులు నిర్వహిస్తామని.. అలాగే 8,9 తరగతుల విద్యార్ధులకు రోజూ మార్చి రోజు క్లాసులు జరుగుతాయని చెప్పారు. అటు 6,7 తరగతుల విద్యార్ధులకు డిసెంబర్ 14 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని అన్నారు.

ఇక సంక్రాంతి సెలవుల తర్వాత 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్ధులకు క్లాసులు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, కరోనా నిబంధనలు పాటిస్తూ స్కూల్స్ నిర్వహిస్తామన్నారు. విద్యార్ధులు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు.

Also Read:

మాస్క్ లేకుంటే రూ. 2 వేలు భారీ జరిమానా.. నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్…

రోజుకు గరిష్టంగా 12 గంటలు.. వారానికి 48 గంటలు.. కార్మిక శాఖ కొత్త ప్రతిపాదన..

ఆరేళ్లుగా వీడని మిస్టరీ కేసు.. నిందితులను పట్టిస్తే రూ. 5 లక్షల డాలర్ల రివార్డు.!

వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!