ఏపీలో నిరుద్యోగ భారతానికిక స్వస్తి.. కొలువుల జాతర

తమ పార్టీ మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని పలుమార్లు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముందడుగు వేశారు. ఏపీలో ఉన్న కంపెనీల్లో స్థానికులకు పెద్ద పీట వేసేలా ఆయన ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్/ ఫ్యాక్టరీస్ యాక్ట్-2019ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో […]

ఏపీలో నిరుద్యోగ భారతానికిక స్వస్తి.. కొలువుల జాతర
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2019 | 2:11 PM

తమ పార్టీ మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని పలుమార్లు తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముందడుగు వేశారు. ఏపీలో ఉన్న కంపెనీల్లో స్థానికులకు పెద్ద పీట వేసేలా ఆయన ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్/ ఫ్యాక్టరీస్ యాక్ట్-2019ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. దీంతో పారిశ్రామిక యూనిట్లు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్లు, ప్రాజెక్ట్‌ల్లో 75శాతం ఉద్యోగాలను స్థానికులకు రిజర్వ్ చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించింది.

అంతేకాదు నైపుణ్యాలు లేవని క్యాండిడేట్లను రిజెక్ట్ చేయడాన్ని ఈ చట్టం ఒప్పుకోదు. కచ్చితంగా కంపెనీనే వారికి శిక్షణ ఇచ్చి మరీ.. ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. దీంతో స్థానికులకు కచ్చితంగా ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. కాగా తన పాదయాత్రలో ఏపీలో నిరుద్యోగాన్ని రూపుమాపుతానని జగన్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1.33 లక్షల వాలంటీర్ల పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. ప్రస్తుతం వాటిని భర్తీ చేసే పనిలో పడిన విషయం తెలిసిందే.