బిగ్ బ్రేకింగ్: మండలి రద్దుకు శాసనసభ ఆమోదం

ఏపీ శాసనమండలి రద్దుకు శాసనసభ ఆమెదం లభించింది. మండలి రద్దు తీర్మానంపై శాసనసభలో విసృత చర్చ జరిగింది. మెజార్టీ సభ్యులు మండలి రద్దు చేయాలంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.  ఈ అంశంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. ఎక్కువ మంది సభ్యులు మద్దతు తెలపడంతో తీర్మానం పాసయినట్టుగా స్పీకర్ ప్రకటించారు. మొత్తం 133 మంది సభ్యులు సభలో ఉండగా..నోస్ గానీ, న్యూట్రల్స్ గానీ ఎవరూ లేకపోవడంతో బిల్లు సంపూర్ణ మద్దతుతో పాసయ్యింది. మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ కేంద్రానికి […]

బిగ్ బ్రేకింగ్: మండలి రద్దుకు శాసనసభ ఆమోదం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2020 | 7:11 PM

ఏపీ శాసనమండలి రద్దుకు శాసనసభ ఆమెదం లభించింది. మండలి రద్దు తీర్మానంపై శాసనసభలో విసృత చర్చ జరిగింది. మెజార్టీ సభ్యులు మండలి రద్దు చేయాలంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.  ఈ అంశంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. ఎక్కువ మంది సభ్యులు మద్దతు తెలపడంతో తీర్మానం పాసయినట్టుగా స్పీకర్ ప్రకటించారు. మొత్తం 133 మంది సభ్యులు సభలో ఉండగా..నోస్ గానీ, న్యూట్రల్స్ గానీ ఎవరూ లేకపోవడంతో బిల్లు సంపూర్ణ మద్దతుతో పాసయ్యింది. మండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ కేంద్రానికి పంపనుంది. ఆ తర్వాత పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం మండలి రద్దు కానుంది.

నేటి ఉదయం మండలి రద్దే కరెక్ట్ అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం జగన్. దీంతో సభాపతి చర్చకు అనుమతిచ్చారు. అయితే టీడీపీ తాము అసెంబ్లీకి దూరంగా ఉండనున్నట్లు ప్రకటించడంతో, వైసీపీ సభ్యులుతో పాటు ఒకే ఒక జనసేన సభ్యుడు రాపాక మండలి రద్దే సరైన నిర్ణయమంటూ తీర్మానాన్ని బలపరిచారు.